COLLECTOR: రీ సర్వేని పకడ్బందీగా చేపట్టండి : కలెక్టర్
ABN , Publish Date - May 19 , 2026 | 11:47 PM
రీ సర్వే పనులను పక డ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదే శించారు. ఆయన మంగళవారం కంబదూరు మండల పరిధిలోని తి మ్మాపురం, ఓబిగానిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. తహసీల్దారు బాలకిషనను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కళ్యాణదుర్గం, మే 19(ఆంధ్రజ్యోతి): రీ సర్వే పనులను పక డ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదే శించారు. ఆయన మంగళవారం కంబదూరు మండల పరిధిలోని తి మ్మాపురం, ఓబిగానిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. తహసీల్దారు బాలకిషనను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమక్షంలోనే పూర్తి స్థాయిలో రీ సర్వే పను లు చేపట్టాలన్నారు.
ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా, రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. రీ సర్వే పనులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు.
కుందుర్పి కోటకు ప్రాధాన్యం ఇవ్వాలని వినతి
కుందుర్పి: మండలకేంద్రంలోని కోటకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రా ధాన్యం కల్పించి, అభివృద్ధి చేయాలని సాంస్కృతిక వారసత్వ పరిరక్ష ణ సమితి అధ్యక్షుడు ప్రసాద్ కలెక్టర్ ఆనంద్‌ను కోరారు. ఆయన మంగళవారం మండల పరిధిలోని ఎనమల దొడ్డి గ్రామంలో పర్య టించిన కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కుందుర్పి కోట ప్రాధాన్యాన్ని వివరించారు. కొండకు మెట్ల మార్గాన్ని, గిరి ప్రదక్షిణకు అవసరమైన దారిని ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.