MLA: ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టండి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:01 AM
పంచాయతీ నిధులను ప్రజావసరాల ప్రాధాన్యం క్రమంలో ఖర్చుచేయాలని ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం ప్రత్యేక అధికారులకు తెలియజే శారు. నియోజకవ ర్గంలోని మూడుమండలాల్లో నియమితులైన ప్రత్యేక అధికారులకు బుధవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుంతకల్లు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పంచాయతీ నిధులను ప్రజావసరాల ప్రాధాన్యం క్రమంలో ఖర్చుచేయాలని ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం ప్రత్యేక అధికారులకు తెలియజే శారు. నియోజకవ ర్గంలోని మూడుమండలాల్లో నియమితులైన ప్రత్యేక అధికారులకు బుధవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో తాగునీటి ఎద్దడి ర్పడకుండా ప్రత్యేక అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలకు పంచాయతీ నిధులను వినియోగించాలన్నారు. ప్రత్యేక అధికారుల విధులు, బాధ్యతలను డీఎల్‌డీవో విజయల క్ష్మి, ఎంపీడీవో దేవదాసు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
డబ్బుకాజేసిన మాజీ సర్పంచులపై ఉపేక్ష వద్దు
పంచాయతీ ఖాతాల్లోని డబ్బును అక్రమ మార్గంలో కాజేసిన ఐదుగురు మాజీ సర్పంచులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రూరల్ సీఐకి తెలియజేశారు. ప్రత్యేక అధికారుల అవగాహనా కార్యక్రమం నుంచే ఎమ్మెల్యే సీఐకి ఫోన చేశా రు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నాన బెయిలబుల్ సెక్షన్లను వర్తింపజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....