Share News

CLEAN: స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:11 AM

చెత్తను తీసుకొని నిత్యసర సరుకులు అందజేసే స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తేజోత్స్న పేర్కొన్నారు. మండల కేంద్రమైన పామిడి పంచాయతీ కార్యాలయంలో శనివారం జీరో వేస్ట్‌ లిట్టర్‌ ఫ్రీ గవర్నెన్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

CLEAN: స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోండి
MPDO Tejotsna launching Swachha Ratha in Pamidi

పామిడి/ విడపనకల్లు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): చెత్తను తీసుకొని నిత్యసర సరుకులు అందజేసే స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తేజోత్స్న పేర్కొన్నారు. మండల కేంద్రమైన పామిడి పంచాయతీ కార్యాలయంలో శనివారం జీరో వేస్ట్‌ లిట్టర్‌ ఫ్రీ గవర్నెన్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విడపనకల్లులో చెత్త సేకరణ రథాన్ని(స్వచ్ఛ రథం) మండల అధికారులు, టీడీపీ నా యకులు ప్రారంభించారు. ఎంపీడీవో రాధాక్రిష్ణ, డిప్యూటి ఎంపీడీవోలు సత్యబాబు, భాస్కర్‌బాబు, టీడీపీ నాయకులు సినిమా రామాంజినే యులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గం రూరల్‌/ గుమ్మఘట: వ్యర్థాలను ఎక్కడపడితే అక్క డ పడవేయకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని ఎంపీడీఓ కొండన్న పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని శనివా రం ఆయన పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అలాగే గుమ్మఘట్ట ఎంపీడీవో కార్యాలయం వద్ద వివిధ గ్రామాలలో స్వచ్ఛ సేవకు వినియోగించే స్వచ్ఛరథాన్ని, ట్రై సైకిళ్లను ఎంపీడీవో జయరాములు , టీడీపీ మండల కన్వీనర్‌ కాలవ సన్నన్న పంపిణీ చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 22 , 2026 | 12:11 AM