PRINCIPAL: స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:00 AM
విద్యార్థినులు స్యయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య పేర్కొన్నా రు. స్ధానిక కళాశాలలో కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా కుట్టిన దుస్తులను ప్రదర్శించారు.
ఎస్కేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య
గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థినులు స్యయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య పేర్కొన్నా రు. స్ధానిక కళాశాలలో కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా కుట్టిన దుస్తులను ప్రదర్శించారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... విద్యార్థినులు చదువుతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణలో ప్రతిభ చాటాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థినులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ బి. వాణిశ్రీ, పీఎం ఉషా కోఆర్డినేటర్ రవిశంకర్ శర్మ, టెక్నికల్ ట్రైనర్ చరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గంరూరల్: ప్రభుత్వ కేటీఎ)స్ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకం కింద ప్రారంభించిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ముగిసినట్లు ఇనఛార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్య ఆధారిత విద్య ప్రాముఖ్యతను తెలుసుకోవడం మంచిదన్నారు. ఆచరణాత్మక నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధికి మార్గాలను చూపిస్తుందన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....