HOSPITAL: ఆసుపత్రి కమిటీ వైస్ చైర్మన ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - May 14 , 2026 | 12:02 AM
పట్టణంలోని సీహెచసీ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మనగా యేళ్ల తిమ్మప్ప బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. అంత కుమునుపు ఆసుపత్రిలో నూతన కమిటీ స భ్యులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉరవకొండ, మే 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సీహెచసీ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మనగా యేళ్ల తిమ్మప్ప బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. అంత కుమునుపు ఆసుపత్రిలో నూతన కమిటీ స భ్యులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులు సుద ర్శన, సరస్వతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటస్వామి చౌదరి, ఎంపీ డీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ రఫీ హాజరయ్యారు. వైస్ చైర్మనను, కమిటీ సభ్యులను టీడీపీ నాయకులు పూలమాలలు వేసి స త్కరించారు. యేళ్ల తిమ్మప్ప మాట్లాడుతూ మంత్రి కేశవ్ సహకారంతో ఆసుపత్రి అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏపీ ఐడీసీ మాజీ డైరెక్టర్ దేవినేని పురుషోత్తం, ఏఎంసీ చైర్మన విజయ్‌భాస్కర్, పీఏసీఎస్ చైర్మన ప్యారం కేశవానంద, పెన్నహోబిలం ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, మాజీ ఎంపీపీలు సుంకరత్నమ్మ, కుళ్లాయప్ప, జనసేన నియోజక వర్గ ఇనచార్జ్ గౌతమ్, టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి దేవకీదేవి, నూతేటి వెంకటేశులు, టీడీపీ నాయకులు గోవిందు, సుంకన్న, వరప్రసాద్, రామాంజినేయులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....