TDP: mసీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:16 PM
మండలకేంద్రమైన యాడికిలో శుక్రవారం జరుగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆదివారం పర్యవేక్షించారు.
- పాల్గొన్న ఎంపీ అంబిక, పూల నాగరాజు
యాడికి, ఏప్రిల్5(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రమైన యాడికిలో శుక్రవారం జరుగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆదివారం పర్యవేక్షించారు. బహిరంగ సభ ప్రాంగణం, హెలిపాడ్, జలధర నిర్వహించే ప్రాంతాలను పరిశీలిం చారు. ఏర్పాట్లపై స్థానిక నాయకులతో చర్చించారు. వారితో పాటు ఏ ర్పాట్లను పర్యవేక్షించిన వారిలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్ మోహిద్దీన, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ తదితరులు ఉన్నారు. సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....