Share News

WATER: ఎండమావులు..!

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:37 PM

వివిధ పనులపై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కడి నీటి కుండలు ఎండమావులను గు ర్తుకు తెస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజల దా హార్తి తీర్చేందుకు ఇక్కడ మూడు మట్టికుండలను ఏ ర్పాటు చేశారు.

WATER: ఎండమావులు..!
Pots set up at the office,

- తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఖాళీ కుండలు

కూడేరు, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): వివిధ పనులపై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కడి నీటి కుండలు ఎండమావులను గు ర్తుకు తెస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజల దా హార్తి తీర్చేందుకు ఇక్కడ మూడు మట్టికుండలను ఏ ర్పాటు చేశారు. కాని దాదాపు 15 రోజుల నుంచి వా టిలో నీరు పోయడం లేదు. ప్రస్తుతం వేసవిలో ఎం డలు మండిపోతున్నాయి. పైగా బ్యాంకుల్లో పంట రుణాల రెన్యువల్‌ జోరుగా సాగుతోంది. రెన్యువల్‌కు అ వసరమైన అడంగల్‌ పత్రాల మీద రెవెన్యూ అధికారుల సంతాల కోసం రైతులు ఎండలోనే తహసీల్దారు కార్యాలయానికి వెళ్తున్నారు. అలా వచ్చిన వారు నీరు తాగుదామని కార్యాలయం వద్ద ఉన్న కుండల వ ద్దకు వెళ్తే వాటిలో నీరుండడం లేదు. ఖాళీ కుండలు కనపడడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం కుండలు పెట్టించిన అధికారులు వాటిలో నీరు పోయించలేరా? అని ప్రశ్నిస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2026 | 11:37 PM