CI: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:30 PM
మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్ సైకిల్ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.
కళ్యాణదుర్గం, జూన 22(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్ సైకిల్ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు. పాఠశాల నుంచి టీ సర్కిల్ మీదుగా టౌన పోలీస్‌స్టేషన వరకు సైకిల్ ర్యాలీ కొనసాగించారు. మత్తుపదా ర్థాల నిర్మూలనకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....