Share News

FARM: మిరప సాగు ప్రారంభం

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:50 PM

మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్‌సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

FARM: మిరప సాగు ప్రారంభం
Farmhands planting chili seedlings in fields irrigated by borewells.

- బోరు బావుల కింద నాట్లు

- సందిగ్ధంలో జీబీసీ - హెచ్చెల్సీ రైతులు

విడపనకల్లు, జూలై 9(ఆంధ్రజ్యోతి): మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్‌సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ బోరు బావుల కింద రైతులు జూన మూడవ వారం నుంచే ప్రాంభించారు. ఆదును ఆలస్యం కాకుండా ఉం డాలని ముందుగానే నర్సరీల్లో మిరప నారును పోయించి 15 రోజుల మొక్కలను తెచ్చి నాట్లు జోరుగా వేస్థున్నారు. జీబీసీ- హెచఎల్‌సీ కాలు వ కింద రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు పడితే అయినా కాలువలకు నీళ్లు వచ్చే సరికి కనీసం మిరప మొలకెత్తే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు. జూలై నెల మొదటి వారంలో మిరప సాగు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ వాన దేవుడు జాడ కనిపంచలేదు. వర్షం వస్తుందనే ఆశ రైతులను మిరప సాగు వైపు లాగుతోంది.


తుంగభద్రా డ్యాంకు వరదలు వచ్చి కనీసం సగం నీరు చేరినా హెచఎల్‌సీకి నీటిని విడుదల చేస్తారు. హెచఎల్‌సీకి నీరు వచ్చిన వారం 10 రోజులకు జీబీసీకి సాగు నీరు విడుదల చేస్తారు. ఇదంతా జరగాలంటే ఇంకో వారం రోజుల్లో కర్ణాటకలోని కూడ్లిగి, శివ మొగ్గ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితేనే డ్యాంకు నీరు చేరుతుంది. రైతులు మిరప సాగుకు దైర్యం వస్తుంది. వర్షాలు కురవక పోతే హెచ ఎల్‌సీ -జీబీసీ కింద వేల ఎకరాల్లో మిరప సాగు వదిలేసే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్థున్నారు. ఈ ఏడాది మిరప సాగు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. గత ఏడాది లాభాలు పొందిన రైతులు ఈ సారి అధికంగా సాగు చేయాలని ఆశ పడుతున్నా రు. కాలువ కింద భూములు సాగు చేసే రైతులు ఈ ఏడాది ఎకర కౌలు రూ. 50వేలు పెట్టి సాగుకు సిద్ధం అయ్యారు. మరి వర్షాలు ఏ విదంగా ఆదుకుంటాయో అనే ఆలోచనలో పడ్డారు రైతులు.

ఆగస్టు వరకు అవకాశం ఉంది - ఏఓ పెన్నయ్య విడపనకల్లు

మిరప రైతులు ఆగస్టు 15 వరకు నాట్లు చేయవచ్చు. జూన చివరి వారంలోనే విత్తనం వేయటం ప్రారంభిస్తారు. కానీ ప్రస్తుతం వర్షా లు ఆలస్యం కావటంతో ఇంకా సాగు ప్రారంభించలేదు. బోరు బావుల కింద అప్పుడే రైతులు మిరప సాగు చేస్తున్నారు. ఇక జీబీసీ - హెచఎల్‌సీ కాలువ కింద రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. బోదులు పాసి సిద్ధం అయ్యారు. వర్షాలు పడి, కాలువలకు నీరు వస్తే వేల ఎకరాల్లో మిరప సాగువుతుంది. వర్షాలు వచ్చిన రెండు నెలలు అనగా ఆగస్టు నెల వరకు మిరప వేయ వచ్చు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 09 , 2026 | 11:51 PM