Share News

POLICE STATION: సిబ్బంది కొరత

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:45 PM

వజ్రకరూరు పోలీస్‌ స్టేషనలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది కేసులు పరిష్క రించలేక సతమవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. పోస్టింగ్‌ ఈ స్టేషనలో ఉన్న సిబ్బంది అటాచ పేరుతో వేరే స్టేషనకు వెళ్లారు. అలగే ఈ స్టేషనకు రావాలం టేనే సిబ్బంది హడలెత్తుతున్నట్లు స మాచారం. ఏఎస్‌ఐలు నలుగురు ఉండగా ప్రస్తుతం స్టేషనలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

POLICE STATION:  సిబ్బంది కొరత
Vajrakarur Police Station

- పోస్టింగ్‌ ఒకచోట.. విధులు మరో చోట

- వజ్రకరూర్‌ పోలీస్‌ స్టేషనలో ఇలా..

ఉరవకొండ, జూన 24(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు పోలీస్‌ స్టేషనలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది కేసులు పరిష్క రించలేక సతమవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. పోస్టింగ్‌ ఈ స్టేషనలో ఉన్న సిబ్బంది అటాచ పేరుతో వేరే స్టేషనకు వెళ్లారు. అలగే ఈ స్టేషనకు రావాలం టేనే సిబ్బంది హడలెత్తుతున్నట్లు స మాచారం. ఏఎస్‌ఐలు నలుగురు ఉండగా ప్రస్తుతం స్టేషనలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు స్పె షల్‌ బ్రాంచలో, మరొకరు ట్రైనింగ్‌లో, ఇంకొకరు సెలవులో ఉన్నారు. ఉన్న ఏఎస్‌ఐనే అన్ని పనులను పర్య వేక్షించాల్సి వస్తోంది. అలాగే ఐదుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు ఉండగా ఒకరు మాత్రమే ఇక్కడ ఉ న్నారు. కొందరు అటాచలోనూ, మరొకరు అనంతపురం ట్రాఫిక్‌కు వె ళ్లారు. 21మంది కానిస్టేబుళ్లుకు గానూ 15మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఆరుగు అటాచ పేరుతో ఉరవ కొండ, గుంతకల్లు వనటౌన, డీఎస్పీ కార్యాలయాల్లో ఉన్నారు. ఈ స్టేషన పరిధిలో ఇటీవల పేకాట శిబిరాలు ఎక్కువగా నిర్వహిస్తున్నా రు. మరో వైపు కేసులు, గొడవలతో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉన్న సిబ్బంది విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది. అటాచకు వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన అవసరం ఉందని పలువులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై సీఐ మహానందిని వివరణ కోరగా సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 24 , 2026 | 11:45 PM