Share News

GOD: నేమకల్లు అంజన్నకు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:35 PM

మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.

GOD: నేమకల్లు అంజన్నకు ప్రత్యేక పూజలు
Nemakallu Anjaneyaswamy in decoration

బొమ్మనహాళ్‌, జూన 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు. అష్టోత్తరశత నామార్చన, విష్ణుసహస్ర నామపారాయణం చేశారు. వేల మంది భక్తులు స్వామి వారిన దర్శించుకుని తీర్థప్రసాదలు స్వీకరించారు.


ఆలయంలో అన్నదానం నిర్వహించారు.

రాయదుర్గం రూరల్‌: మండలంలోని మల్లాపురం సమీపం లో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి, వడ్రవన్నూరులో వెలసిన అపులాపురం ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేకపూజ లు నిర్వహించారు. మూల విరాట్లకు పంచామృతాభిషేకం, అలంక రణ, కుంకుమార్చన, ఆకుపూజ, వెండికవచధారణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు గావించారు.

Updated Date - Jun 06 , 2026 | 11:35 PM