Share News

MLA: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:45 PM

పట్టణంలోని పోలీస్‌స్టేషన తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం రాత్రి పర్య టించారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ పట్టణంలో ఏమైనా సమస్య లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

MLA: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి
MLA Ashmita Reddy talking to people

- ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పోలీస్‌స్టేషన తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం రాత్రి పర్య టించారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ పట్టణంలో ఏమైనా సమస్య లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలను ఆప్యా యంగా పలకరిస్తూ షాపుల నిర్వాహకులతో మాట్లాడారు. వ్యాపారాలు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు సర్కిల్‌లో నిలబడి అటు ఇటుపోయే జనాలతో పట్టణంలో సమస్యలపై మాట్లాడారు. వేసవిలో ఎక్కడైనా తాగునీరు, విదుత తదతరల సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ పలువురితో ఆరాతీశారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్లు విజ్జి, మల్లికార్జున ప్రసాద్‌నాయుడు సుదర్శనరెడ్డి, గోవర్ధనరెడ్డి రంగ నాయకులు తదితరులు ఉన్నారు.

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

పెద్దపప్పూరు: మండలంలోని జూటూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆలయ కమి టీ వారికి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. ఆయన వెంట టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2026 | 11:45 PM