FESTIVAL: ఘనంగా ఉట్లమాను పరుష
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:49 PM
కంబదూరు మండల కేంద్రంలోని కమల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక గ్రంథాలయ ఆవరణంలో ఉట్ల పరుషను అత్యంత వైభవంగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, యువకులు, పెద్దలు అనే తారతమ్యం సంబరాల్లో పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కంబదూరు మండల కేంద్రంలోని కమల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక గ్రంథాలయ ఆవరణంలో ఉట్ల పరుషను అత్యంత వైభవంగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, యువకులు, పెద్దలు అనే తారతమ్యం సంబరాల్లో పాల్గొన్నారు. ఉట్ల పరుషను తిలకించడానికి చుట్లు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఉత్సవ నిర్వాహకులు వారికి అన్ని సదుపాయాలను సమకూర్చారు. ఎస్‌ఐ లోకేష్‌కుమార్ పర్యవేక్ష ణలో గట్టి బందోబస్తు నిర్వహించారు.