WORKERS: స్మార్ట్ కిచెనను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:01 AM
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్‌కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.
- మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
యాడికి, జూన 4(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్‌కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్‌కిచెన పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రభుత్వ ప్రయత్నాలను వెంటనే విరమించుకో వాలని డిమాండ్‌చేశారు. పాఠశాలల్లోనే వంటచేసి విద్యార్థులకు వేడి వేడి భోజనం అందించడం ద్వారా నాణ్యమైన పోషకాహారం అందుతుం దన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెనూ చార్జీలను పెంచకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రతి విద్యార్థికి మెనూ చార్జీ లను రూ.20 పెంచాలని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను వెం టనే పెంచాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షు లు ఉమాగౌడ్, మండల కార్యదర్శి మహాలక్ష్మి, గౌరవాధ్యక్షుడు బషీర్ అహమ్మద్, నాయకులు రాఘవశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కణేకల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాల నుకుంటున్న స్మార్ట్ కిచెన విధానాన్ని ఉప సంహరించుకోవాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో -2 భవానీ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు రా ము, మధ్యాహ్న భోజన ఏజెన్సీ సంఘం నాయకు లు రామాంజి నేయులు, వన్నూరమ్మ, భాగ్యమ్మ, హనుమక్క తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...