PGRS: తరచూ డుమ్మా..!
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:10 PM
ప్రజా సమస్యల పరి ష్కారం కోసం సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు(పీజీఆర్‌ఎస్)కు చాలా మంది అధి కారులు డుమ్మా కొట్టారు. ప్రతి సోమవారం ఇలాగే ఉందని, దీంతో పెం డింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు తీరడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
పీజీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు
గుంతకల్లు టౌన, జూన 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కారం కోసం సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు(పీజీఆర్‌ఎస్)కు చాలా మంది అధి కారులు డుమ్మా కొట్టారు. ప్రతి సోమవారం ఇలాగే ఉందని, దీంతో పెం డింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు తీరడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోందని అంటు న్నారు. పలుమార్లు కలెక్టర్ ఆదేశించినా అధికారుల నిర్లక్ష్యం వల్ల సమ స్యలు ఎక్కడిక్కడే నిలచిపోతున్నాయని, మూడు నెలల నుంచి ఇలాగే ఉందంటున్నారు. స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు కేవలం ఎనిమిది శాఖల అధికారులు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హాజరయ్యా రు.
11 గంటల నుంచి 11.40వరకు ఇరిగేషన, హౌసింగ్ అధికారులు, ఏఈవో, అర్‌అండ్‌బీ అధికారి, వెలుగు శాఖ అధికారి హాజరయ్యారు. 14 శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. ఈ విషయంమై తహసీల్దార్ రమాదేవిని వివరణ కోరగా పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటిసులు జారీ చేస్తామని తెలిపారు.
తాడిపత్రి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వ హించిన పీజీఆర్‌ఎస్‌కు కేవలం నాలుగు శాఖల అధికారులు మొక్కుబ డిగా హాజరుకావడం గమనార్హం. దీంతో చాలామంది అర్జీదారులు నిరా శతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఉదయం 11గంటలకు తహసీల్దార్ రవి చంద్ర, వ్యవసాయ, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మాత్రమే కనిపించారు. మిగతాశాఖల అధికారులు రాలేదు. ఇతర రోజుల్లో కార్యాలయాల చుట్టూ తిరగలేక పీజీఆర్‌ఎస్‌కు వచ్చామని, ఇక్కడ కూడా అధికారులు లేకపోతే తమ సమస్యలు ఎవరికి చెప్పాలని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....