Share News

MLA: వృత్తివిద్యలో నైపుణ్యం పెంచుకోవాలి

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:10 AM

మహిళలు వృత్తివిద్యలో నైపుణ్యాలు పెంచుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పిలుపునిచ్చా రు. మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో సోమవారం కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్‌, బ్యూటిషియన 30 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

MLA: వృత్తివిద్యలో నైపుణ్యం పెంచుకోవాలి
MLA Sindhura Reddy presenting certificates to women

మహిళలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచన

పుట్టపర్తి రూరల్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మహిళలు వృత్తివిద్యలో నైపుణ్యాలు పెంచుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పిలుపునిచ్చా రు. మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో సోమవారం కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్‌, బ్యూటిషియన 30 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మహి ళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడు తూ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న వృత్తివిద్యలో నైపుణ్యాలు పెంచుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు శిక్షణ నిర్వాహకులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

పుట్టపర్తి రూరల్‌: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొ న్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె సోమవారం మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డితో కలసి నియోజక వర్గంలోని 28 మందికి మంజూరైన రూ 15,48,425 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 03 , 2026 | 12:10 AM