Share News

FIELDS: పొలాలకు దారి చూపండి

ABN , Publish Date - May 31 , 2026 | 01:11 AM

భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అయితే ఆ పొలాలకు దారి లేదంటూ అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండ లంలోని గుండ్లపల్లి ఎస్సీ కాలానికి చెందిన లబ్ధిదారులు వాపోతున్నారు.

FIELDS: పొలాలకు దారి చూపండి
Beneficiaries seeking guidance to their farms

- గుండ్లపల్లి ఎస్సీ కాలనీ వాసులు

బెళుగుప్ప, మే 30(ఆంధ్రజ్యోతి): భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అయితే ఆ పొలాలకు దారి లేదంటూ అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండ లంలోని గుండ్లపల్లి ఎస్సీ కాలానికి చెందిన లబ్ధిదారులు వాపోతున్నారు. 2004వ సంవత్సరంలో ప్రభుత్వం సర్వే నంబర్‌ 26-6లో నిరు పేద ఎస్సీలకు భూ పంపిణీ కోసం 16 ఎకరాల దేవదాయ మాన్యం కొనుగోలు చేసింది. దానిని ఎస్సీ కార్పొరేషన ద్వారా గుండ్లపల్లి ఎస్సీ కాలనీకి చెం దిన భూమిలేని నిరుపేదలు సవారక్క, హనుమంతప్ప, లింగమ్మ, మా రెన్న, అంజనక్క, లలితమ్మ, రుద్రయ్య, దుర్గమ్మ పంపిణీ చే సింది. అయి తే ఆ పొలాలకు వెళ్లేందుకు దారి చూపలేదు. దీంతో అప్పటినుంచి ప్రతి యేటా వర్షాలు కురిసి విత్తనం సాగుకు సమయం వచ్చినప్పుడల్లా ఇ బ్బంది పడాల్సిందేనని వారు వాపోతున్నారు. ఆ పొలాలకు దారిలేదని పలువురు అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు.. ఈ సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుం డా పోతోందంటున్నారు. ఇరవైయేళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 31 , 2026 | 01:11 AM