Share News

SHORTAGE : పంచాయతీ కార్యదర్శుల కొరత

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:13 PM

గ్రామీ ణ ప్రాంతాల పాలనలో కీ లకపాత్ర పోషించే పం చాయతీ కార్యదర్శుల కొర త మండలంలో వేధిస్తోం ది. గ్రామ పంచాయతీ ల లో ప్రభుత్వ పథకాల అ మలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి.

SHORTAGE : పంచాయతీ కార్యదర్శుల కొరత
Auvuladhatla Village Secretariat

సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందుల్లో ప్రజలు

రాయదుర్గం రూరల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గ్రామీ ణ ప్రాంతాల పాలనలో కీ లకపాత్ర పోషించే పం చాయతీ కార్యదర్శుల కొర త మండలంలో వేధిస్తోం ది. గ్రామ పంచాయతీ ల లో ప్రభుత్వ పథకాల అ మలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి. అయితే పంచాయతీ కార్యాలయాల్లో అవసర మైన స్థాయిలో నియమకాలు జరుగక పోవడంతో గ్రామాలలో పాలన సక్రమంగా సాగడం లేదని ప్రజలు వా పోతున్నారు. మండలంలో 19 పంచాయతీలకు గాను 14 సచివాలయాలు ఏర్పాటు చేసి, కార్యదర్శుల ను(డీడీవోలను) నియమించారు. వీటిలో ఆవులదట్ల, బీఎనహళ్లి, టీ వీరాపురం గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులను నియమించలేదు. ఇనచార్జులతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అదే విధంగా నాగిరెడ్డిపల్లి సచి వాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి కల్పన మెడికల్‌ లీవ్‌లో ఉండగా ఇనచార్జ్‌ బాధ్యతలను డీ కొండాపురం పంచా యతీ కార్యదర్శి వీరశేఖర్‌కు అప్పగించారు.


చదం పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శి సల్మానసుల్తానా డిప్యూటేషనపై వెళ్లగా, చదం గొల్లలదొడ్డిలో విధులు నిర్వహిస్తున్న అయ్యప్పస్వామికి ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఆవులదట్లలో పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండడంతో రేకులకుంట పంచాయతీ కార్యదర్శి పాండు కు ఇనఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా బీఎన హళ్లి పం చాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండడంతో కొంతానపల్లి పంచాయతీ కార్యదర్శిఅశోక్‌కు ఇన చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. టీ వీరాపురం పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండడంతో గ్రామదట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీహర్షకు ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

- ప్రస్తుతం ఒక్కొక్క కార్యదర్శి తను పనిచేస్తున్న పంచాయతీతో పాటు అదనంగా మరో పంచాయతీ బాధ్యతలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా పంచాయతీల్లో ప్రభుత్వ పథకాల అమలు ఆలస్యం కావడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయా పంచాయతీల ప్రజలు వాపోతున్నారు. ఇటీవల ఆనలైన విధానం, డిజిటల్‌ నమోదు ప్రక్రియ పెరగడంతో కార్యదర్శులపై సాం కేతిక ఒత్తిడి పెరిగింది. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ వ్యవస్థ బలప డాలంటే కార్యదర్శుల కొరతను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయా గ్రామప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ కొండన్నను వివరణ కోరగా మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత వాస్తవమేనని తెలిపారు. ఈ విషయాన్ని డీపీఓ నాగరాజునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 27 , 2026 | 11:13 PM