SEWAGE: తిష్టవేసిన మురుగు సమస్య
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:00 AM
మండలకేంద్రంలో మురు గునీటి సమస్య తిష్టవేసింది. వీధుల్లోనే మురుగునీటితో కలిసి వృఽథానీరు పారుతోంది. మండల కేంద్రంలో అక్కదేవతల గుడి నుంచి సర్పంచ భారతి ఇంటి వెనుక భాగం మీదుగా పుట్టపర్తి ప్రధాన రోడ్డు వరకు, బీసీకాలనీ, పాతబాలాజీ పాఠశాల వెనుక వరకు మురుగునీటి కాలువ ఉంది.
- మండలకేంద్రంలో అధికమైన దోమలు, దుర్వాసన
- ఎన్నేళ్లు గడిచినా పరిష్కారానికి నోచుకోని వైనం
- అలాగే కాలం వెళ్ల దీస్తున్న ప్రజలు
నల్లమాడ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో మురు గునీటి సమస్య తిష్టవేసింది. వీధుల్లోనే మురుగునీటితో కలిసి వృఽథానీరు పారుతోంది. మండల కేంద్రంలో అక్కదేవతల గుడి నుంచి సర్పంచ భారతి ఇంటి వెనుక భాగం మీదుగా పుట్టపర్తి ప్రధాన రోడ్డు వరకు, బీసీకాలనీ, పాతబాలాజీ పాఠశాల వెనుక వరకు మురుగునీటి కాలువ ఉంది. ఇంకెక్కడా ఎక్కడ మురునీటి కాలువలు లేవు. ఇళ్లలో నుంచి మురుగునీటితో పాటు వృథానీరు కూడా ఆ కాలువలోకి వస్తుంది. అయితే ఆ కాలువలో అక్కడక్కడ చెత్తాచెదారం నిండి పోయి మురుగు నీరు ముందుక కదలడం లేదు. దీంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇది ఇలా ఉండా సత్యమ్మ వీధి నుంచి మసీదువీధి, కుమ్మరవీధి, హైస్కూల్ వీధుల్లో మురుగునీటి కాలువలు లేకపోవడంతో సీసీరోడ్లపైనే మురుగునీరు, వృథానీరు పారుతూ, ఎస్సీకాలనీని రోడ్లపైకి వెళుతున్నాయి. దీంతో ఎస్సీకాలనీలోని రోడ్లు మురికినీటి నిండి పోయాయి. రోడ్లు పాచిపట్టి, దుర్వాసన వస్తోంది.
ఆ కాలనీలో ద్విచక్రవాహనంలో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిందే, రోడ్లు పాచి పట్టడంతో వాహనాలు జారిపడి, పలువురు గాయాల పాలైన సంఘట నలు అనేకమున్నాయి. ఇలా అక్కడి ప్రజలు దాదాపు 30 సంవత్సరాలు గా ఇబ్బందులు పడుతున్నారు. కానీ పాలకులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రధానంగా ఎస్పీ కాలనీలో గతంలో డెంగీ సోకి ఓ చిన్నారి మృతిచెందింది. ఈ 30యేళ్లలో మంత్రులుగా ఉన్నప్పుడే రఘువీరారెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి అప్పటి కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కాలనీలో పర్యటించి, కాలువల దుస్థితిని పరిశీలించారు. అలా మిగతా వారూ పరిశీలిస్తున్నారే కానీ, పరిష్కారం శూన్యమని కాలనీవాసులు వాపోతున్నారు. ఇక బస్టాండ్ సమీపంలో బీసీకాలనీ, పాత బాలాజీ హైస్కూల్ వెనుకభాగాన ఉన్న మురుగునీటి కాలువ చెత్తచెదారంతో నిండిపోయింది. దీంతో ప్రధాన రహదారిలో వెళ్లాలంటే దుర్వాసన వెదజల్లుతోందని విద్యార్థులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని వారుకోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....