GOD: వైభవంగా పల్లకి సేవ
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:27 AM
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి పల్లకిసేవను ఘనంగా నిర ్వహంచారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాల తో అలంకరించి, పల్లకిలో కొలువుదీర్చి, మేళతాళాల మధ్య ఊరేగించారు.
ఉరవకొండ, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి పల్లకిసేవను ఘనంగా నిర ్వహంచారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాల తో అలంకరించి, పల్లకిలో కొలువుదీర్చి, మేళతాళాల మధ్య ఊరేగించారు. పల్లకి సేవలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే నిత్య అన్నదానానికి ఇనచార్జ్ ఈవో తిరుమలరెడ్డి కుమార్తె దక్షితరెడ్డి రూ.10వేలు విరాళంగా అందించారు.
ఈవో రమేష్‌బాబు బాధ్యతల స్వీకరణ
పెన్నహోబిలం లక్ష్మీనరసిం హస్వామి ఆలయ ఈవోగా సాకే రమేష్‌బాబును నియమిస్తూ దేవదాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆయన ఇనచార్జ్ ఈవో తిరుమల రెడ్డి నుంచి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులతో కలిసి తన వంతుగా కృషి చేస్తానని నూనత ఈఓ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....