MLA: స్వీయ గణన నమోదు ప్రారంభం
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:46 PM
ప్రభుత్వం గురువారం నుంచి చేపట్టిన స్వీయ గణన నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆయన పట్టణంలోని తన నివాసంలో గురువారం ఉదయం తన వివరాలను కంప్యూటర్‌లో యాప్ ద్వారా స్వీయగణన నమోదు చేసుకున్నారు.
రాయదుర్గం, ఏప్రిల్ 16(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం గురువారం నుంచి చేపట్టిన స్వీయ గణన నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆయన పట్టణంలోని తన నివాసంలో గురువారం ఉదయం తన వివరాలను కంప్యూటర్‌లో యాప్ ద్వారా స్వీయగణన నమోదు చేసుకున్నారు. ఆర్డీవో వసంతబాబు, మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, తహసీల్దార్ హరికుమార్, ఎంపీడీవో కొండన్న, ఎంఈవో వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రి: స్వీయగణన కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తన నివాసంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వీయ గణన చేసుకొని సెన్సెస్ ఐడీ నెంబర్ పొందారు.
దానిని సంబంధిత అధికారి పరిశీలించి సెన్సెస్ ఐడీనెంబర్ ద్వారా వారి వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సోమశేఖర్, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, సివిల్‌సప్లై అధికారి మల్లేష్, ఏఎస్‌ఓ కల్పన తదితరులు పాల్గొన్నారు.
పెద్దవడుగూరు: జనగణన -2027లో భాగంగా మొదటి దశ అయిన గృహగణన, స్వీయగణన నమోదు ప్రక్రియను గురువారం ఆరె కటిక అభివృద్ధి కార్పొరేషన చైర్మన శ్రీహరికృష్ణారావు గారి ఇంటి వద్ద ప్రారంభించారు. వారి వివరాలు నమోదు చేశారు. తహసీల్దార్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.