COMMITTEE: పద్మశాలీయ పట్టణ కమిటీ ఎంపిక
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:47 PM
పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం పద్మశాలీయ సంఘం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జలదుర్గం దామోదర్‌దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు.
తాడిపత్రి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం పద్మశాలీయ సంఘం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జలదుర్గం దామోదర్‌దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా సంఘం గౌరవాధ్యక్షులుగా వద్ది శివసత్యనారాయణ, చెన్నా రాజగోపాల్, న్యాయ సలహాదారులుగా సతీష్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా వద్ది దామోదర్ ఎన్నుకున్నారు. ఆయన ధర్మకర్తగా సోమా నడిపి కొండప్ప, సంఘం ప్రధాన కార్యదర్శిగా చెన్నా రంగేశ్వర, ఉప కార్యదర్శిగా శ్రీమతి పోకూరి వాణి, కోశాధికారిగా వద్ది లక్ష్మీనరసయ్యతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కమిటీ మెంబర్లను ఎ నుకున్నారు. అందరూ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారో త్సవానికి పద్మశాలి కులస్థులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....