COLONY: వీధి దీపాలులేని సంతగేటు
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:49 PM
దాదాపు యాభై ఏళ్ల క్రితం వారపుసంత నిర్వహించేందుకు మండలకేంద్రానికి కూతవేటు దూరం లో సంతగేటు కాలనీ ఏర్పాటైంది. ఎంతోమంది నిరుపేదలు అక్క డ ఇళ్లు నిర్మించుకుని నివాసాలుండేవారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ప్రస్తుతం 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. 150 మం దికిపైగా జనం నివసిస్తున్నారు.
సరైన రహదారకీ నోచుకోని కాలనీ
వర్షం వస్తే నడిచి వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి
ఎన్ని విన్నపాలు చేసినా ఎవరూ...
పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన
తనకల్లు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): దాదాపు యాభై ఏళ్ల క్రితం వారపుసంత నిర్వహించేందుకు మండలకేంద్రానికి కూతవేటు దూరం లో సంతగేటు కాలనీ ఏర్పాటైంది. ఎంతోమంది నిరుపేదలు అక్క డ ఇళ్లు నిర్మించుకుని నివాసాలుండేవారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ప్రస్తుతం 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. 150 మం దికిపైగా జనం నివసిస్తున్నారు. 70కిపైగా ఓట్లు ఉన్నాయి. మండలకేం ద్రం సమీపంలోనే ఉన్నా ఆ కాలనీలో నేటికీ వీధి లైట్లు లేవు. పూర్వపు వారపు సంత ప్రాంతంలో ఏడుళ్ల క్రితం చౌకధాన్యపు డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి గోడౌనను నిర్మించింది. ఈ కాలనీ గుండానే బియ్యం వాహనాలు గోడౌనకు వెళ్లా ల్సి ఉంది. రోజూ అనంతపురం నుంచి బియ్యాన్ని తరలించి గోడౌన లో నిలువ చేస్తారు. ఇక్కడి నుంచి తనకల్లు, నల్లచెరువు, అమడగూరులోని కొన్ని గ్రామాల ప్రభుత్వ చౌక డిపోలకు నిత్యవసర సరుకులు సరఫరా చేస్తారు. ఈ ప్రాంతంలో వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు గ్రామానికి నీటిని సరఫరా చేసే పైపులైన పగిలిపోయి యేడాది కావస్తున్నా పట్టించుకున్న వారెవరూలేరు.
జాతీయ రహదారి 42 నుంచి కాలనీ మధ్యలో గోడౌన వరకు మట్టిరోడ్డే. భారీ వాహనాలు రావడంతో ఈ రోడ్డు కాస్త గుంతల మయమైంది. వర్షం వస్తే నీరు నిలువ ఉండి, నడవడానికి కూడా వీ లుకాదు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కాలనీవాసులు రా స్తారోకోలు, ధర్నాలు చేశారు. గోడౌనకు బియ్యం తరలించకుండా అడ్డు కున్నారు. ఆందోళనచేసిన ప్రతిసారి అధికారులు హామీ ఇవ్వడం, ఆందో ళన సద్దుమణిగేలా చూడటం పరిపాటిగా మారిందని కాలనీ వాసులు వాపోతున్నారు. గ్రామంలో తాగునీటి కొళాయిలను ఏర్పాటుచేసినా వా రానికి ఒకసారి మాత్రమే నీరు వదులుతారు. కొళాయిల వద్ద గుంతలు తీసి, నీటిని పట్టుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కాలనీ వాసుల్లో ఓ నలుగురు తప్ప మిగిలిన వారంతా కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎవరికీ సెంటు భూమి లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందిం చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
పరిష్కారానికి కృషిచేస్తాం : డిప్యూటీ ఎంపీడీఓ
సంతగేటు కాలనీలో నెలకున్న సమస్యలను ఆంధ్రజ్యోతి డిప్యూటీ ఎంపీడీఓ మురళీ శ్రీనివాసు, దృష్టికి తీసుకెళ్లగా... సంతగేటు కాలనీ సమస్యలు మూడునెలల క్రితం మా దృష్టికి వచ్చాయి. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....