Share News

GOD: ఘనంగా శంకరాచార్యుల జయంతి

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:39 PM

పట్టణంలోని నూతన బ్రా హ్మణ భవనలో మంగళవారం ఆదిగురువు శంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యుల విగ్రహానికి క్షీరాభి షేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జోష్యం జనార్దనశాసి్త్ర హాజరయ్యారు.

GOD: ఘనంగా శంకరాచార్యుల జయంతి
The leaders of the Brahmin community participated in the Shankara Jayanti celebrations

తాడిపత్రి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని నూతన బ్రా హ్మణ భవనలో మంగళవారం ఆదిగురువు శంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యుల విగ్రహానికి క్షీరాభి షేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జోష్యం జనార్దనశాసి్త్ర హాజరయ్యారు. ఈ సంద ర్భంగా బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు రాచకొండ జానకిరామశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని పేర్కొన్నారు. పట్టణంలోని బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణం పూర్తిచేస్తానన్నారు. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. సంఘం డైరెక్టర్‌ రాచకొండ హర్షశర్మ మాట్లాడుతూ శంకరాచర్యుల జీవితం యువతకు ఆదర్శమని, ఆయన బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బాల ఎల్లయ్యస్వామి, కోశాధికారి హరిప్రసాద్‌, సభ్యులు పాల్గొన్నారు.

ప్రతిభా విద్యార్థులకు సత్కారం

ఐఏఎస్‌, గ్రూప్‌- 2 పరీక్షలో ప్రతిభ చూపిన బ్రాహ్మణ విద్యార్థులు, వారి తల్లి దండ్రులను బ్రాహ్మణసంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నూతన భవనంలో సంఘం అధ్యక్షుడు జానకిరామశర్మ, సభ్యులు ఘ నంగా సన్మానించారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో తాడిపత్రికి చెందిన విజయలక్ష్మి, ఉమామహేశ్వరరావు దంపతుల కుమారుడు సాయికృష్ణ అత్యంత ప్రతిభ చూపి ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. అలాగే సంఘం కార్యదర్శి బాలయ్యస్వామి, సావిత్రి దంపతుల కుమార్తె చందన గ్రూప్‌- 2 ఫలితాల్లో అత్యంత ప్రతిభను కనబరిచి సబ్‌ రిజిసా్ట్రర్‌ పోస్టుకు ఎంపి కయ్యారు. ఆ ఇద్దరిని, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 21 , 2026 | 11:39 PM