Share News

GOD: ధ్యానంతోనే మోక్షం

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:48 PM

ధ్యానం ద్వారానే మోక్షం సాధ్యమవుతుందని పట్టణంలోని గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని గూళ్యపాల్యం లో సోమవారం గురుదేవ ఆశ్రమంలో నూతన శిలామండపాన్ని పీఠాధి పతి ప్రణవానందస్వామి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు.

GOD: ధ్యానంతోనే మోక్షం
The dignitaries who participated in the opening ceremony of Shilamandapam

- కరిబసవ రాజేంద్రస్వామి - శిలామండపం ప్రారంభం

ఉరవకొండ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ధ్యానం ద్వారానే మోక్షం సాధ్యమవుతుందని పట్టణంలోని గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని గూళ్యపాల్యం లో సోమవారం గురుదేవ ఆశ్రమంలో నూతన శిలామండపాన్ని పీఠాధి పతి ప్రణవానందస్వామి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. చంద్రమౌళీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం కరిబసవ రాజేంద్రస్వామి మాట్లాడుతూ... ఆధ్యాత్మికతతోనే శాంతి, సహ నం అలవాటు అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యానంద భార తి స్వామి, సచ్చిదానంద స్వామి, మహానంది గిరిస్వామి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 13 , 2026 | 11:48 PM