ROAD: ఆసుపత్రి రహదారికి మోక్షం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:28 PM
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారికి నేడు పల్లే పండుగలో మోక్షం లభించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు 30 ఏళ్లుగా సరైన దారి లేక రోగులు, వైద్య సిబ్బంది చాలా అవస్థలు పడేవారు. పల్లె పండుగ 2.0లో బాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి సీసీ రోడ్డును వేయిస్తున్నారు.
- పల్లె పండుగతో నెరవేరుతున్న మండల వాసుల కల
విడపనకల్లు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారికి నేడు పల్లే పండుగలో మోక్షం లభించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు 30 ఏళ్లుగా సరైన దారి లేక రోగులు, వైద్య సిబ్బంది చాలా అవస్థలు పడేవారు. పల్లె పండుగ 2.0లో బాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి సీసీ రోడ్డును వేయిస్తున్నారు. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న దారికి నేడు మోక్షం కలగడంతో వైద్య సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు పయ్యావుల సో దరులకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపుగా 250 మీటర్లు పొడవు కోసం రూ. 12లక్షలతో ప్రతి పాదనలు పంపినట్లు ఏఈ లక్ష్మినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు డిప్యూటి ఎంపీడీఓలు సత్యబాబు, భాస్కర్‌బాబు, వైద్యులు మస్రద్‌జాహా, టీడీపీ నాయకులు విజయ్‌శెట్టి, డీలర్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండలపరిధిలోని అంచనహాళ్ గ్రామంలోని బీసీ కాలనీలో పల్లె పండుగలో భాగంగా సీసీ రోడ్డు పనులను గురువారం టీడీపీ నాయకులు గురువారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, బలరాం, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....