Share News

BUILDING: అర్ధాంతర భవనాలకు మోక్షం

ABN , Publish Date - May 20 , 2026 | 11:45 PM

మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ సచివాలయాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చొరవతో మోక్షం లభించనుంది. గత వైసీపీ పాలనలో మండలంలోని పలు గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపో యింది.

BUILDING: అర్ధాంతర భవనాలకు మోక్షం
A half-stopped secretariat building in Hanimireddypalli

బెళుగుప్ప, మే 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ సచివాలయాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చొరవతో మోక్షం లభించనుంచి. గత వైసీపీ పాలనలో మండలంలోని పలు గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపో యింది. అవి గ్రామాల్లో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామా ల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. మంత్రి పయ్యావుల కేశవ్‌ చొరవతో నియోజవకర్గ వ్యాప్తంగా విడుదల చేసిన నిధులలో మండలం లో ని అలాంటి ఏడు భవనాల నిర్మాణానికి రూ. 1.49 కోట్లు మంజూరయ్యాయి. మండలంలో హనిమిరెడ్డిపల్లి, గుండ్లపల్లి ఎర్రగుడి రామసాగరం, బెళుగుప్ప, నరసాపురం, తగ్గుపర్తి గ్రామాల సచివాలయ భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరైన ట్లు పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ పరశురాం తెలిపారు. ఎట్టకేలకు మంత్రి చొరవతో నిర్మాణపు పనులు పూర్తి కానున్నాయని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 20 , 2026 | 11:45 PM