BUILDING: నిర్మాణం ఆగిన భవనాలకు మోక్షం
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:38 PM
గత వైసీపీ ప్రభుత్వం హ యాంలో అసంపూర్తిగా ఆగిపోయిన స్వర్ణ గ్రామ పంచాయతీలు, రైతు సేవా కేంద్రాలు, అంగన వాడీ కేంద్రాల నిర్మా ణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.21.33కోట్లు నిధులను మంజూరు చేసింది. వైసీపీ ప్రభు త్వంలో నియోజకవర్గంలో పలు అంగనవాడీ భవనాలు, గ్రామ సచివాల య భవనాల నిర్మాణం చేపట్టారు.
- మంత్రి కేశవ్ చొరవతో నిధుల మంజూరు
- ప్రత్యేక జీవో ద్వారా రూ.21.33 కోట్లు విడుదల
ఉరవకొండ, జూన 2(ఆంద్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం హ యాంలో అసంపూర్తిగా ఆగిపోయిన స్వర్ణ గ్రామ పంచాయతీలు, రైతు సేవా కేంద్రాలు, అంగన వాడీ కేంద్రాల నిర్మా ణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.21.33కోట్లు నిధులను మంజూరు చేసింది. వైసీపీ ప్రభు త్వంలో నియోజకవర్గంలో పలు అంగనవాడీ భవనాలు, గ్రామ సచివాల య భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే వాటి నిర్మాణం పూర్తి కా కుండానే ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించి, చేతులు దు లుపుకున్నారు. అర్ధాంతరంగా నిర్మాణాలు నిలిచిపోవడంతో అవి చాలా చోట్ల ఉపయోగంలోకి రాలేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఆ భవనా లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అటువంటి భవనా లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పం చాయతీ రాజ్ అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించి, నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. దీంతో
నియోజకవర్గంలోని ఉర వకొండ మండలంలో తొమ్మిది సచివాల యాలకు రూ.2.43కోట్లు, విడప నకల్లు మండలంలో 16 భవనాలకు రూ.3.10కోట్లు, బెళుగుప్ప మండలం లో ఏడు భవనాలకు రూ.1.49కోట్లు, కూడేరు మండలంలో మూడు భవ నాలకు రూ.89లక్షలు, వజ్రకరురూలో ఐదు భవనాలకు రూ.1.70కోట్లు కేటాయించారు. 32 రైతు సేవా కేంద్రాలకు రూ.6.33కోట్లు నిధులను విడుదల చేశారు. అలాగే నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయి న అంగన వాడీ కేంద్రాలకు 5.39కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రకారం నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మొత్తం రూ. 21.33 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే ప్రజలకు, ఉద్యోగులకు ఇక్కట్లు తప్పుతాయి. అదేవిధంగా అద్దె భవనాలలో నిర్వహి స్తున్న సచివాలయాలకు ఈ భవనాలు అందుబాటులోకి వస్తే ఇరుకు గదుల నుంచి సిబ్బందికి విముక్తి కులుగుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై మండల ఇంజనీర్ రవీంద్రను వివరణ కోరగా టెండర్‌లు పిలిచామని, ప్రక్రియ పూర్తి కాగానే, పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...