Share News

WATER: తాగునీటి కోసం పరుగులు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:40 PM

మండలంలోని గోవింద వాడ గ్రామస్థులు తాగునీటికి చాలా ఇ బ్బందులు పడుతున్నారు. సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వ్య వసాయ బోర్లు వద్దకు పరుగులు తీ స్తున్నామని మండిపడుతున్నారు. గ్రామం లోని బసవేశ్వర కాలనీలో రెండు వారాలుగా నీటి సరఫరా నిలిచి పోయింది.

WATER: తాగునీటి కోసం పరుగులు
Villagers going to the farm bore for water

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవింద వాడ గ్రామస్థులు తాగునీటికి చాలా ఇ బ్బందులు పడుతున్నారు. సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వ్య వసాయ బోర్లు వద్దకు పరుగులు తీ స్తున్నామని మండిపడుతున్నారు. గ్రామం లోని బసవేశ్వర కాలనీలో రెండు వారాలుగా నీటి సరఫరా నిలిచి పోయింది. గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన నుంచి నీరు దిగువకు వెళుతుండడంతో, ఎగువనున్న బసవేశ్వర కాలనీకి నీరు రావడం లేదంటున్నారు. మధ్యలో గేట్‌వాల్‌ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారిం చాలని విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయా రు. రోజువారీ అవసరాల కోసం వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైన స్పందించాలని వారు కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 12 , 2026 | 11:40 PM