Share News

DONATION: కసాపురం ఆలయానికి రూ. 2.34లక్షల విరాళం

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:57 PM

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్‌ రూ. 2,34,567 విరాళం అందజేశారు.

DONATION: కసాపురం ఆలయానికి రూ. 2.34లక్షల విరాళం
Talari Ravikumar handing over the cheque to the temple Executive Officer (EO).

గుంతకల్లుటౌన, జూన 13(ఆంధ్రజ్యోతి): కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్‌ రూ. 2,34,567లు విరాళం అందజేశారు. శనివారం ఆలయ ఈఓ విజయరాజుకు తలారి రవి కుమార్‌ చెక్కును అందజేశారు. అనంతరం దాతలకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వాదం చేసి శేష వస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2026 | 11:57 PM