MLA: రూ. 165 కోట్లతో పట్టణాభివృద్ధి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:51 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ. 165 కోట్లతో రాయదుర్గం పట్టణాభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆయన సోమవారం పట్టణంలోని తాగునీటి శుద్ది కేంద్రం నుంచి బళ్లారిరోడ్డులో ఉన్న జీఎల్‌ఎస్‌ఆర్ వరకు రూ. 30 కోట్లతో నిర్మించిన పైప్‌లైన, శాంతినగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వరకు వేసిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు.
ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం, ఏప్రిల్ 13(ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ. 165 కోట్లతో రాయదుర్గం పట్టణాభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆయన సోమవారం పట్టణంలోని తాగునీటి శుద్ది కేంద్రం నుంచి బళ్లారిరోడ్డులో ఉన్న జీఎల్‌ఎస్‌ఆర్ వరకు రూ. 30 కోట్లతో నిర్మించిన పైప్‌లైన, శాంతినగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వరకు వేసిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. శిలాఫల కాలను ఆవిష్క రించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయదుర్గం పట్టణాన్ని, నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామన్నారు. ఆధునిక హంగుల ను అద్ది మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, పద్మశాలి కార్పొరేషన డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, టీడీపీ పట్టణాధ్యక్షుడు బండి క్రిష్ణమూర్తి, నాయకులు టంకశాల హనుమంతు, కడ్డిపూడి మహబూబ్‌బాషా, ప్రశాంతి, బండి భారతి, రావూత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....