Share News

WATER: తాగునీటి కోసం రాస్తారోకో

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:57 PM

మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు.

WATER: తాగునీటి కోసం రాస్తారోకో
Women protesting for drinking water in Udiripikonda.

కూడేరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు పది రోజులుగా గ్రామం లో తాగు నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. ఫిల్టర్‌ బెడ్‌ల మరమ్మతుల కారణంగా పీఏబీఆర్‌ నీరు రావడం లేదన్నారు. అదేవిధం గా పంచాయతీ నీటిని కూడా సక్రమంగా సరఫరా చేయక పోవడంతో గ్రామంలో నీటి సమస్య ఏర్పడిందన్నారు. అయితే సమస్య సంబంధిత అధికారులు పట్టించుకోవడలేదని మహిళలు మండిపడ్డారు. ఎన్నిసార్లు వారి ఎదుట మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం వహిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. గ్రామస్థుల రాస్తారోకోతో ప్రధాన రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విషయం తెలుసుకున్న ఉరవకొండ సీఐ మహానంది, కూడేరు పోలీ సులు అక్కడి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం లోగా సమస్య తీరుస్తామని హమీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన విరమించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను సీఐ మహనంది, సిబ్బంది క్లియర్‌ చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 07 , 2026 | 11:57 PM