Share News

రీసర్వేని సక్రమంగా నిర్వహించాలి: జేసీ

ABN , Publish Date - May 07 , 2026 | 12:07 AM

మండలంలో రీసర్వే పనులు సక్ర మంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి. విష్ణుచరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం శెట్టూరు మండలం లోని కైరేవు గ్రామంలో రీసర్వే పనులలో భాగంగా సర్వే నంబర్‌ 25లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.

రీసర్వేని సక్రమంగా నిర్వహించాలి: జేసీ
JC Vishnucharan

శెట్టూరు, మే 6(ఆంధ్రజ్యోతి): మండలంలో రీసర్వే పనులు సక్ర మంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి. విష్ణుచరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం శెట్టూరు మండలం లోని కైరేవు గ్రామంలో రీసర్వే పనులలో భాగంగా సర్వే నంబర్‌ 25లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రీసర్వేలో అవకతవకలు జరిగితే సంబంధిత అధికారు లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఏడీ సర్వే ఆనలైన రికార్డ్స్‌(అనంతపురం) తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, మండల సర్వేయర్‌, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జేసీ కైరేవు గ్రామంలోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని, అనంతరం లక్షుం పల్లిలో జరుగుతున్న పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీని పరిశీలించారు.


పకడ్భందీగా చేపట్టండి : ఆర్డీవో

బెళుగుప్ప: పొరపాట్లకు తావివ్వకుండా రీ సర్వే చేపట్టాలని సర్వే సిబ్బందికి ఆర్డీవో వసంతబాబు సూచించారు. మండలంలోని అంకం పల్లిలో జరుగుతున్న రీసర్వేని ఆయన బుధవారం పరిశీలించారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ గురుబ్రహ్మ, సర్వేయర్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 07:12 AM