Share News

JC: రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలి : జేసీ

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:50 PM

భూముల రీ సర్వేని సం బంధిత రైతు సమక్షంలోనే చేసి, ఆ పొలంలోనే వారి ఈకేవైసీ పూర్తి చే యాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అధికారులకు సూచించారు. మండలంలోని పొలికి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను జేసీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

JC: రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలి : జేసీ
JC Vishnucharan inspecting the survey work.

విడపనకల్లు, జూన 23(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేని సం బంధిత రైతు సమక్షంలోనే చేసి, ఆ పొలంలోనే వారి ఈకేవైసీ పూర్తి చే యాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అధికారులకు సూచించారు. మండలంలోని పొలికి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను జేసీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన రైతులు, అధికారులతో మాట్లాడుతూ సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వోల సమా వేశం నిర్వహించారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐఓఎస్‌ చంద్రశఖర్‌రెడ్డి, ఐఓఎస్‌ విజయసారథి, తహసీల్దారు వెంకటేశ్వరమ్మ, ఆర్‌ఐ పోతన్న, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 23 , 2026 | 11:50 PM