FARMERS: ఓబులయ్య కుంటకు నీరివ్వాలని మంత్రికి వినతి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:30 PM
హంద్రీనీవా నీటితో కూడేరు సమీపంలోని ఓబులయ్య కుంటను నింపి రైతులను ఆదుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు కూడేరు రైతులు విన్నవించారు. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలోని తాగునీటి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడేరు రైతులు ఆది వారం మంత్రిని కలిశారు.
కూడేరు, ఏప్రిల్ 5(ఆదివారం): హంద్రీనీవా నీటితో కూడేరు సమీపంలోని ఓబులయ్య కుంటను నింపి రైతులను ఆదుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు కూడేరు రైతులు విన్నవించారు. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలోని తాగునీటి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడేరు రైతులు ఆది వారం మంత్రిని కలిశారు. ఓబులయ్యకుంటకు నీరొస్తే ఎంతో మంది రైతుల బోరుబావుల్లో నీరు సమృద్ధిగా పెరుగుతుందన్నారు. కడదరకుంట సమీపంలోని పిల్ల కాలువ నుంచిగానీ, కరుట్లపల్లి చెరువు నుంచి గానీ ఓబులయ్య కుంటకు హంద్రీనీవా నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో మంత్రి స్పందిస్తూ తక్షణం ఆ ప్రాంతంలో రైతుల వివరాలను తెలియజేయాలని సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....