Share News

FARMERS: రైతులకు రెన్యువల్‌ కష్టాలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:32 PM

మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల రెన్యువల్‌కు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతు న్నా బ్యాంకుల వద్ద వేచి ఉండి రెన్యువల్‌ చేసుకుంటున్నారు. అయితే వారికి బ్యాంకు వద్ద నీడ వసతి కల్పించాల్సిన బ్యాంకర్లు కరుణించే పరిస్థితి లేదు.

FARMERS: రైతులకు రెన్యువల్‌ కష్టాలు
Farmers basking in the sun at Andhra Pradesh Grameen Bank

- మండుటెండలో అల్లాడిపోతున్న వైనం

కూడేరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల రెన్యువల్‌కు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతు న్నా బ్యాంకుల వద్ద వేచి ఉండి రెన్యువల్‌ చేసుకుంటున్నారు. అయితే వారికి బ్యాంకు వద్ద నీడ వసతి కల్పించాల్సిన బ్యాంకర్లు కరుణించే పరిస్థితి లేదు. దీంతో కొన్ని రోజులుగా బ్యాంకుల్లో ఉక్కపోతు నడుమ అన్న దాతలు రెన్యువల్‌ చేసు కుంటున్నారు. మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ గ్రామీణ బ్యాంకు, ఎస్‌బీఐ ఉన్నాయి. వాటిలో అన్నదాతలు విరివిరిగా పంటరుణాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ గ్రామీణ బ్యాంకులో పదిహేను రోజులుగా పంట రుణాలను రెన్యువల్‌ చేస్తున్నారు. వందలాది మంది అన్నదాతలు, మహిళా రైతులు, వృద్ధులు వస్తున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూనే రుణాలను రెన్యువల్‌ చేస్తున్నా, వారికి ఉపశమనం కలిగించాలనే ఆలోచన సంబంధిత బ్యాం కర్లకు లేకపోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే స్టేట్‌ బ్యాంకు వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా టెంట్లు వేసి, కూర్చోవడానికి కుర్చీలు వేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 21 , 2026 | 11:32 PM