Share News

RAIN: ఊరట నిచ్చిన వర్షం

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:59 PM

జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వర కు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొద్దిరోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిపోయిన ప్రజలు, రైతులకు కొంత ఊరటనిచ్చిం ది.

RAIN: ఊరట నిచ్చిన వర్షం
Rainwater accumulated in the fields of Chayapuram.

జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వర కు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొద్దిరోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిపోయిన ప్రజలు, రైతులకు కొంత ఊరటనిచ్చిం ది. ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. వాడిపోతున్న పం టలకు ఈ వర్షం మేలు చేస్తుందని వానకోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇలాగే వర్షాలు కురిస్తే పంటలకు మరింత మేలు జరుగుతుందని మిరప, కంది, ఆముదం రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం రాకతో పండ్లతోటల రైతులకు కొంత ఊరట లభించింది.

ఉరవకొండ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున ఉరు ములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఉరవకొండలో 62. 2 మి.మీ., వజ్రక రూరులో 55.2మి.మీ. వర్ష పాతం నమోదైంది. పట్టణ సమీపంలోని చాబాల రోడ్డు ్డలో ఉన్న వంక ఉధృతంగా ప్రవహించింది. వజ్రకరూరు మండలంలోని చాయాపురంలో సమీపంలో హంద్రీనీవా కాలువలోకి భారీగా వరద నీరు చేరింది. వంక ఉధృతికి గ్రామ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. గడేహోతూరు, కొనకొండ్ల గ్రామాల మ ధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. మిరప, కంది పంటలు నీట ముని గాయి. ప్యాపిలి గ్రామం వద్ద చెక్‌ డ్యాంలోకి వర్షపు నీరు చేరింది.

గుత్తి రూరల్‌: మండల వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆది వారం ఉదయం వరకు ఏకాధాటిగా వర్షం కురవడంతో గ్రామాలలో వం కలు, వాగులు పొంగి పారాయి. గుత్తి మండల వ్యాప్తంగా 40.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ పుణ్యవతి తెలిపారు.

విడపనకల్లు: మండలంలోని పొలికి, అంచనహాలు, హావళిగి, కరక ముక్కల, పాల్తూరు గ్రామాల్లో కుంటలు, చెక్‌ డ్యాంలు నిండిపోయి పొం గి పొర్లాయి. హావళిగి ఎంఐ ట్యాంక్‌ నిండి ఉధృతంగా ప్రవహిస్తోంది, దీంతో కర్షాటక ప్రాంతానికి వెళ్లే వాహనదారులు, ట్యాంక్‌ అటు వైపు ఉన్న పొలాలకు వెళ్లటానికి దారి లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. 39.2మీమీ వర్షపాతం నమోదైంది.

బెళుగుప్ప: మండలంలో 48.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.


కళ్యాణదుర్గం: కంబదూరు మండల పరిధిలోని రాంపురం- కర్తనపర్తి సమీపంలో పెన్నానది పరివాహక ప్రాంతం అంతా వర్షపు నీరు ప్రవహించింది. ఆదివారం ఉదయం కూడా కళ్యాణదుర్గం, కంబదూరు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.

డి. హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): డి. హీరేహాళ్‌ మండలంలోని ఎం. హనుమాపురం, కుడ్లూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంక లు పొంగిపొర్లాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద నీరు దిగువకు చేరడంతో ఎం. హనుమాపురం వద్ద చెక్‌డ్యామ్‌ నిండింది. అలాగే బొమ్మనహాళ్‌ మండలంలో 80.2 మి.మీ. వర్షం పాతం నమోదై నట్లు అధికారులు తెలి పారు. మండల కేంద్రంతోపాటు ఉద్ధేహాళ్‌, శ్రీధరఘట్ట, శింగానహళ్లి, గోవిందవాడ, దర్గాహొన్నూరు గ్రామాల్లో వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

యల్లనూరు: మండలంలో పదును వర్షపాతం నమోదైంది. వెన్నపూసపల్లి, జంగంపల్లి, పాతపల్లిలో వంకలు ప్రవహించాయి.

పెద్దవడుగూరు: మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దవడుగూరు వాగు, చిట్టూరు సమీపాన పెన్నానది పరివాహక ప్రాంతం ఉధృతంగా ప్రవహించాయి. మండలంలో 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 20 , 2026 | 11:59 PM