Share News

VHC: ప్రారంభానికి సిద్ధం

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:21 AM

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్ని పంచాయతీలలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2020-21 సంవత్సరంలో మండలంలో 15 పంచాయతీల్లో ఒక్కో భవనానికి నేషనల్‌ హెల్త్‌ మిషన కింద రూ. 17 లక్షల వంతున నిధులు మంజూరు చేశారు.

VHC: ప్రారంభానికి సిద్ధం
Village Health Clinic ready in Junzurampalli.

- నిర్మాణాలు పూర్తయిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు

రాయదుర్గం రూరల్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్ని పంచాయతీలలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2020-21 సంవత్సరంలో మండలంలో 15 పంచాయతీల్లో ఒక్కో భవనానికి నేషనల్‌ హెల్త్‌ మిషన కింద రూ. 17 లక్షల వంతున నిధులు మంజూరు చేశారు. వాటితో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు ప్రారంభించారు. వాటిలో కొన్ని పూర్తి కాగా ప్రభుత్వం మారడంతో కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మండలంలోని వడ్రవ న్నూరు, జుంజురంపల్లి, పల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో అర్ధాంతరంగా ఆగిపోయిన భవనాలకు నిధులు కేటాయించడంతో పనులు పూర్తి అయ్యాయి. దీంతో ఆయా గ్రామాలలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని ప్రారంభించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 21 , 2026 | 12:21 AM