Share News

RDO: సర్‌పై ఆర్డీవో తనిఖీ

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:51 PM

కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్‌, అర్బన పరిధిలోని పలు పోలింగ్‌ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్‌ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. బీఎల్‌ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.

RDO: సర్‌పై ఆర్డీవో తనిఖీ
RDO issuing instructions to officials at the Ontimiddi polling station.

కళ్యాణదుర్గం రూరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్‌, అర్బన పరిధిలోని పలు పోలింగ్‌ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్‌ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. బీఎల్‌ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు. అనంతరం ఆయన పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సర్‌ 2026 గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మంగళవారం నాటికి డిజిటలైజేషన ప్రగతి 67.92 వుందన్నారు. దానిని వేగవంతం చేసేందుకు సహరించాలని ఆర్డీవో రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.

14లోగా సర్వే పూర్తి చేయాలి : ఈఆర్వో

బెళుగుప్ప: సర్‌ సర్వేని ఇంటింటికి వెళ్లి ఈ నెల 14వ తేదీలోగా పూ ర్తి చేయాలని నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జున రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మం గళవారం సర్‌ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఆర్‌వో మా ట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 56.20 శాతం సర్వే జరిగిందని, బీఎల్వోలు సమన్వయంతో పనిచేసి గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఈవోఆర్డీ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 07 , 2026 | 11:51 PM