GOD: కన్నుల పండువగా రథోత్సవం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:52 PM
హంపి పున్నమి ఉత్స వాల్లో భాగంగా కంబదూరు కమల మల్లేశ్వరస్వామి రథోత్సవం మంగళ వారం మండల కేంద్రంలో అశేష భక్త జనం నడుమ కన్నుల పండువ గా సాగింది. ఉదయం ఆలయంలో శివపార్వతులకు విశేష పూజలు చే శారు
-అశేష జనసందోహం మధ్య ఊరేగిన మల్లేశ్వరస్వామి
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): హంపి పున్నమి ఉత్స వాల్లో భాగంగా కంబదూరు కమల మల్లేశ్వరస్వామి రథోత్సవం మంగళ వారం మండల కేంద్రంలో అశేష భక్త జనం నడుమ కన్నుల పండువ గా సాగింది. ఉదయం ఆలయంలో శివపార్వతులకు విశేష పూజలు చే శారు. పల్లకిపై ఉత్సవమూర్తులు కదలిరాగా, ఆలయ ఈవో దేవదాస్, మాజీ సర్పంచ శ్రీరాములు, ఛైర్మన గాజుల హనుమంతరాయుడు ఆధ్వ ర్యంలో రథాంగ హోమం, బ్రహ్మ రథం పూజ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి ఓం నమఃశివాయ అంటూ భక్తులు రథాన్ని లాగారు. కంబదూరులోని పురవీధులన్నీ శివనామస్మర ణతో మార్మోగాయి. స్వామివారికి ప్రత్యేక పుష్పాలు, ఫలాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.ఈ రథోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....