Share News

GOD: కొండల మధ్య కొలువైన రంగనాథుడు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:05 PM

కోర్కెలు తీర్చే కొంగుబం గారంగా శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాథస్వామి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ప్రాచీనమైన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సమీపంలో, తాడిపత్రి పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో వెలిసింది.

GOD: కొండల మధ్య కొలువైన రంగనాథుడు
Aluru Kona Ranganathaswamy who is worshiping

-నేటి నుంచి ఆలూరు కోనలో బ్రహ్మోత్సవాలు

తాడిపత్రి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కోర్కెలు తీర్చే కొంగుబం గారంగా శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాథస్వామి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ప్రాచీనమైన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సమీపంలో, తాడిపత్రి పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో వెలిసింది. ఆలూరు సమీపంలో రెండు కొండల మఽ ద్య ఉన్న ఈ పర్యాటక పుణ్యక్షేత్రం సమీపంలో ఏడాది పొడవునా ప్రవ హించే సహజ జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి, ప్రశాంతతకు నిలయం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1334లో విజయనగర సామ్రాజ్యంలోని రాజవంశంలోని బుక్రాయస్థానం అధిపతిగా ఉన్న ఎర్రం రాజు నిర్మించారని చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణ దేవరాయ కాలంలో మరింత అభివృద్ధి చెందిందని స్థల పురాణం చెబు తోంది. ప్రాచీన రంగనాథస్వామి క్షేత్రాలలో ఒకటిగా నిలు స్తోంది.


గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత శ్రీదేవి, భూదేవి, నాభి కమలంలో బ్రహ్మదేవుడు దర్శనిమిస్తారు. ఈ స్వామివారిని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు పూజించి నట్లు స్థల పురాణం చెబుతోంది.

బ్రహ్మోత్సవాలు ఇలా.. ఆలూరు కోసం రంగనాథ స్వామి బ్రహ్మోత్సవారం శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 4వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ధ్వజారోహణం, కలశస్థాపన, దీక్షాహోమం, శనివారం రాత్రి సింహవాహనం సేవ, గ్రా మోత్సవం, ఈనెల 29న రాత్రి శేషవాహనం, 30న హనుమద్‌వాహనం, ఏప్రిల్‌ 1న గజవాహనం, 2న ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత కోన రంగనాథస్వామి కల్యాణోత్సవం, సాయంత్రం ఆలూరు లో రథోత్సవం ఉంటాయని తెలిపారు. ఏప్రిల్‌ 3న అశ్వవాహనసేవ, పారువేట, ఏప్రిల్‌ 4న వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రికి హంస వాహనంసేవ నిర్వహిం చనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరవుతారన్నారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేసినట్లు వారు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 26 , 2026 | 11:05 PM