HEALTH: ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై ర్యాలీ
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:07 AM
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాస్ ఎడ్యుకేషన సంస్థ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్ఞానసుధ, ఐసీటీసీ విభాగం స్టాఫ్ సంయుక్తంగా పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినో త్సవాన్ని జరుపుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్)
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాస్ ఎడ్యుకేషన సంస్థ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్ఞానసుధ, ఐసీటీసీ విభాగం స్టాఫ్ సంయుక్తంగా పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినో త్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహ న కల్పించారు. అలాగే డి. హీరేహాళ్ మండలంలోని నాగలాపురం గ్రా మంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ జశ్వంత ఆధ్వర్యంలో ప్రపంచ ఆరో గ్య దినోత్సవాన్ని నిర్వహించారు. పుట్లూరులో స్థానిక ప్రభుత్వ ఆసు పత్రి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వైద్యాధికారి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. బ్రహ్మసముద్రంలో వైద్యాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ ఆధ్వ ర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....