MLA: రూప్‌టాప్ సోలార్‌పై అవగాహన పెంచండి
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:46 PM
రూప్‌టాప్ సోలార్‌పై అవగా హన కల్పించాలని విద్యుతశాఖ ఏడీ ప్రభాకర్‌రావుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసం లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
-ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి
తాడిపత్రి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రూప్‌టాప్ సోలార్‌పై అవగా హన కల్పించాలని విద్యుతశాఖ ఏడీ ప్రభాకర్‌రావుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసం లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్తు బిజిలి యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. దేశంలో పేదరికం తగ్గించి మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందాన్ని పెంపొందించేందుకే ఈ పథకం ఏర్పాటు చేసిందని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. వీటివల్ల యువత ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు 3వేల వరకు దర ఖాస్తులు వచ్చాయని ఏడీ తెలుపగా ఇంకా పెంచాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....