MLA: రాగులపాడు కాల్వకు నిధులు తెస్తా
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:35 PM
హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీరందించే రాగులపాడు కాలువకు తప్పక నిధులు తెస్తా నని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారు. స్థానిక పుర పాలక సంఘం వద్ద కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రైతు సంఘం నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడు తూ రాగులపాడు కాల్వకు నిధులివ్వాలంటూ తాను అసెంబ్లీలో గళమె త్తానన్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉంద న్నారు.
- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుంతకల్లు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీరందించే రాగులపాడు కాలువకు తప్పక నిధులు తెస్తా నని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారు. స్థానిక పుర పాలక సంఘం వద్ద కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రైతు సంఘం నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడు తూ రాగులపాడు కాల్వకు నిధులివ్వాలంటూ తాను అసెంబ్లీలో గళమె త్తానన్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉంద న్నారు. గత ప్రభుత్వంలో మాదిరి ఉత్తుత్తి టెండర్లు, భూమి పూజలు తాను చేయనన్నారు. ధర్మవరం గేటు వద్ద ఆర్‌యూబీ నిర్మాణానికి ఎ లాగైతే నిర్వాసితులకు పరిహారమిచ్చేందుకు డబ్బు సమకూర్చానో, అదే విధంగా రాగులపాడు కాల్వ కోసం నిధులను తెచ్చిన తర్వాతే భూ మి పూజ చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే నుంచి స్పష్టమైన హామీ లభించడంతో రైతు సంఘ నాయకులు దీక్షలను విరమించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ జగదీశ, టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి, కేసీ హరి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, రామన్న చౌదరి, ఫజులు, గుజరీ ఖాజా, హనుమంతు, యు. ప్రభాకర్, అంజి, కేశప్ప, ఓ చంద్రన్న, సీపీఐ నాయకులు బీ గోవిందు, వీరభద్రస్వామి, బీ మహేశ, గోపి, మహమ్మద్ గౌస్, రాయల్ రాము తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....