MARKET: మార్కెట్ యార్డులో రభస
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:42 PM
స్థానిక మార్కెట్ యార్డు లో చైర్‌పర్సన, కార్యదర్శికి మధ్య స్పర్థలు తారాస్థాయికి చేరాయి. చైర్ పర్సనకు చెందిన వాహన అలవెన్సు బిల్లును కార్యదర్శి పెట్టకపోవడం, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగుల జీతాల ఆర్డరుపై చైర్‌పర్సన నెలపా టు సంతకం చేయడంలో ఆలస్యం చేసే వరకూ పరిస్థితి దారితీసింది.
చైర్‌పర్సన, కార్యదర్శి మధ్య స్పర్థ
కార్యదర్శి తమకు వద్దంటూ ఫిర్యాదు
కమిటీ మీటింగ్ గరంగరం
గుంతకల్లు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్ యార్డు లో చైర్‌పర్సన, కార్యదర్శికి మధ్య స్పర్థలు తారాస్థాయికి చేరాయి. చైర్ పర్సనకు చెందిన వాహన అలవెన్సు బిల్లును కార్యదర్శి పెట్టకపోవడం, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగుల జీతాల ఆర్డరుపై చైర్‌పర్సన నెలపా టు సంతకం చేయడంలో ఆలస్యం చేసే వరకూ పరిస్థితి దారితీసింది. యార్డు అభివృద్ధి విషయంగా కార్యదర్శి సహకరించడం లేదని చైర్‌ప ర్సన, ఆమె భర్త మాజీ జడ్పీటీసీ సభ్యుడు మత్రునాయక్ ఆరోపిస్తున్నా రు. అయితే కమిటీ విషయంలో సంబంధంలేని చైర్‌పర్సన భర్త అనవ సరంగా జోక్యం చేసుకుంటున్నారని కార్యదర్శి బాలాజీ రావు ఆక్షేపిస్తున్న ట్టు సమాచారం. మూడు నెలలు కావస్తోంది. సమావేశం నిర్వహిం చాలని నెల నుంచి కోరుతున్నా కార్యదర్శి మొండికేశారని చైర్‌పర్సన ఆ రోపిస్తున్నారు. ఇలా ప్రతి విషయానికీ చైర్‌పర్సన, కార్యదర్శి మధ్య పొ రపొచ్చాలు తారాస్థాయికి చేరాయి. చివరికి కమిటీ సమావేశంలో కార్యదర్శికి, చైర్‌పర్సన లక్ష్మీదేవి, ఆమె భర్త మత్రునాయక్ మధ్య మాటామాటా పెరగ్గా, కమిటీ సభ్యులు సర్దిచెప్పే పరిస్థితి తెలెత్తింది.
సహకరించడం లేదు
మార్కెట్ యార్డు కమిటీ ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి పనులను ప్రతి పాదించగా, ఆ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియదని యార్డు కార్యదర్శి బా లాజీ రావు నిర్లక్ష్యం చేస్తున్నారని చైర్‌పర్సన, కమిటీ సభ్యులు ఆరోపి స్తున్నారు. మార్కెట్ యార్డు స్థలంలో షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణం, కోల్డు స్టోరేజీ, కార్యాలయ మరమ్మతులకు అంచనాలను తయారుచేసి పంపా రు.
‘తాము ఫాలో అప్ చేస్తాము... ఆ ఫైల్సు ఇప్పుడు ఏ కార్యాలయం లో నిలిచాయో చెప్పాలని కోరగా ... రిపోర్టులు పంపడం వరకే నాపని, అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కాదు.’ అంటూ కార్యదర్శి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని చైర్‌పర్సన అంటున్నారు. తన వాహన బిల్లును ఉద్దేశ్య పూర్వకంగా పెట్టడంలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్యద ర్శితో పాటు మార్కెట్ యార్డు ఉద్యోగులందరి జీతాల బిల్లుపై చైర్‌ప ర్సన సంతకం చేయకపోవడంతో నెల జీతం సిబ్బందికి ఆలస్యమైంది.
సమావేశం నిర్వహించడంలేదు
మార్కెట్ యార్డు కార్యదర్శి ఏ విషయంలోనూ సహకరించడం లేద ని, కనీసం మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలని నెల రోజు ల నుంచీ అడుగుతున్నా పెడచెవిన పెట్టారని చైర్‌పర్సన ఆరోపిస్తున్నా రు. మూడు నెలలు మీటింగ్ పెట్టకుంటే కమిటీ రద్దవుతుందని తెలి సినా పట్టించుకోలేదన్నారు. ఈ నెల 26వ తేదీకి మూడు నెలలు పూర్తి కానుండగా, ఒత్తిడి తెచ్చిన మీదట 23న మీటింగ్ పెట్టారని తెలిపారు. ఈ సమావేశంలో యార్డు కార్యదర్శి బాలాజీ రావుకు చైర్‌పర్సన లక్ష్మీ దేవి, ఆమె భర్త మత్రునాయక్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుం ది. చైర్‌పర్సనకు ఇవ్వాల్సిన అలవెన్సు బిల్లు, ఉద్యోగుల జీతాల బిల్లు పెండింగు, యార్డు అభివృద్ధి పనుల ఫైళ్ల ఆచూకీ విషయంగా వారు వాదులాడుకున్నారు.
ప్రతి విషయంలో చైర్‌పర్సన భర్త మత్రునాయక్ జోక్యం ఏంటని కార్యదర్శి అభ్యంతరం చెబుతుండగా, తన భార్యకు అవగాహన లేని కారణంగా మాట్లాడితే తప్పా.. అంటూ మత్రునాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సభ్యులు కార్యదర్శిని సమావేశం నుంచి దూరంగా తీసుకెళ్లి సమస్య పెద్దది కాకుండా చూశారు.
ఈ కమిషనర్ మాకొద్దు- లక్ష్మీదేవి, చైర్‌పర్సన, గుంతకల్లు మార్కెట్ యార్డు
మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి గురిం చి ఏమాత్రం పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేస్తున్నం దున సభ్యుల సూచన మేరకు ఈ కార్యదర్శి మాకు వద్దనే నిర్ణయానికి వచ్చాం. కార్యదర్శి బాలాజీ రావు మాకు వద్దని ఎమ్మెల్యేకి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌కు ఫిర్యాదు చేశాం.
విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నా
- బాలాజీ రావు, మార్కెట్ యార్డు కార్యదర్శి, గుంతకల్లు
నా విధులను నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నా ను. మార్కెట్ యార్డు అభివృద్ధికి సంబం ధించిన అంచనాలు తయారు చేసి పంపాం. నిధుల మం జూరు విషయంగా ప్రయత్నాలు చేస్తామని చైర్‌ప ర్సన, ఆమె భర్త మత్రునాయక్ అడిగితే చైర్‌పర్సనకు కూడా లెటర్ ప్యాడ్‌లో వివరాలు ఇచ్చాను. కమిటీకి నా స్థాయిలో నేను సహకరిస్తున్నాను.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....