Share News

MLA: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

ABN , Publish Date - May 16 , 2026 | 11:59 PM

ప్రజా దర్బారులో విన్న వించే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బారును నిర్వహించారు.

MLA: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

-ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుంతకల్లు, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రజా దర్బారులో విన్న వించే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బారును నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని తేవాలన్న సత్సంకల్పంతోనే ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. తహసీల్దారు రమాదేవి, పాల మల్లి కార్జున, రామన్న చౌదరి, ఉడదాల ప్రభాకర్‌, పత్తి హిమబిందు, వీరేశ కుమార్‌, శివన్న, సద్దాం, లక్ష్మీనారాయణ, మహదేవ్‌, తదితరులు పాల్గొన్నారు.

మినీ మహానాడును జయప్రదం చేయండి

త్వరలో నిర్వహించే నియోజకవర్గ మినీ మహానాడును టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం టీడీపీ స్థానిక కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 16 , 2026 | 11:59 PM