Share News

GOD: రెండో రోజు కొనసాగిన పూజలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:48 PM

మండలంలోని కలుదేవ నహళ్లిలోని నూతన ఆలయంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించా రు.

GOD: రెండో రోజు కొనసాగిన పూజలు
Vedic scholars performing Mahasnapana to the idols

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని కలుదేవ నహళ్లిలోని నూతన ఆలయంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించా రు. ఇందులో భాగంగా మహాస్నపనాన్ని వైభవంగా నిర్వహించారు. విగ్రహా లకు వేదావతి హగరి నదీజలాలతో అభిషేకం చేశారు. ఉదయం ద్వార తోరణ, కుంభారాధన, చతుస్థానార్చన, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. బుధవారం ఉదయం విగ్రహాల ప్రతిష్ఠాపన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2026 | 11:48 PM