VRO: వీఆర్వోల నిరసన
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:45 PM
కర్నూలు జిల్లాలో వీ ఆర్‌వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
గుంతకల్లు టౌన, (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో వీ ఆర్‌వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ వీఆర్‌వోలకు రెవెన్యూయేతర పను లు అప్పగించరాదన్నారు. రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, గ్రా మ రెవెన్యూ సహాయకులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశా రు. వీఆర్వో ఆత్మహత్యకు కారుకులైన అధికారులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత, కార్యదర్శి వెంకటేష్, సభ్యులు మల్లికార్జున, సుధాకర్, సుబ్బరా వు, చిట్టిబాబు, శారద, శృతి, లావణ్య, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
గుత్తి: వీఆర్వో ఆత్మహత్యపై రెవెన్యూ ఎంపాయీస్ జేఏసీ ఆధ్వ ర్యంలో స్ధానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట వీఆర్వోలు నిరసన చేపట్టారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
వీఆర్వో మహమ్మద్ హుసేన మరణానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సురేంద్ర, బాల రాజు, సుధాకర్ రెడ్డి, రంగస్వామి, వెంకటరాముడు, రఫీ, అనురాధ, పక్కీరప్ప, తదితరులు పాల్గొన్నారు.
యల్లనూరు: వీఆర్‌వో హుస్సేన ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని మండల రెవెన్యూ సిబ్బంది సోమవారం స్థానిక త హసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమపై పనిభారం తగ్గించాలంటూ తహసీల్దార్‌కు సింధుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో మన్మథరెడ్డి, గ్రామ వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
యాడికి: తమకు పనిఒత్తిడి తగ్గించాలని కోరుతూ మండలంలోని వీఆర్వోలు సోమవారం తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డికి వినతిపత్రం అంద జేశారు. వీఆర్వో మహమ్మద్‌హుస్సేన ఆత్మహత్య చేసుకోవడం బాధా కరమని అన్నారు. వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు కుమార స్వామి, వీఆర్వోలు రమేష్, నరసింహరాజు, దామోదర్‌నాయుడు, రంగస్వామి, శ్రావణ్, గంగన్న, భీమేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.