PROTEST: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన
ABN , Publish Date - May 17 , 2026 | 12:08 AM
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్దానిక పొట్టి శ్రీ రాములు సర్కిల్‌లో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
గుంతకల్లు టౌన, మే16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్దానిక పొట్టి శ్రీ రాములు సర్కిల్‌లో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన కార్యదర్శి బి. సురేష్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, జిలాన, సత్తార్, వినోద్, సాయి, రామదాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో స్ధానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో నాలుగు చక్రాల వాహనం లాగుతూ నిరసన తెలిపారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, నాయకలుఉ మారుతిప్రసాద్, జగ్గలి రమేష్, సాకే నాగరాజు, సురేంద్ర, షబ్బీర్, సూరి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ/గుత్తి: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ రాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు శని వారం పట్టణంలో ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు మధుసూదన, రైతు సంఘం నాయకులు వెంకటేష్, ము రళి, శీనప్ప పాల్గొన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం నాయ కులు గుత్తిలో ఆటోలను తాళ్లతో లాగుతూ వెళ్లి, స్ధానిక గాంధీ సర్కిల్ వద్ద అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల, నాయకులు మల్లికార్జున, రేణుకా, మల్లేష్, చందు, రామేశ్వరి, తదిరులుపాల్గొన్నారు.
రాయదుర్గం రూరల్: డీజిల్, పెట్రోల్‌పై ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ నాయకులు పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఏపీ రైతు సంఘం తాలూకా కార్యదర్శి విద్యా స్వామి, ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి నాగయ్య, ఏఐవైఎఫ్ కుమార్ నాయక్, రైతు సంఘం నాయకులు నంజప్ప, దుర్గన్న, సదాశివారెడ్డి, వెంకటేశులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....