Share News

PROTECTION: అరటికి ఈతాకు రక్షణ

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:16 PM

ఎండల నుంచి అరటిమొక్కలను రక్షించుకోవడానికి రైతులు ఈత ఆకులను ఉపయోగిస్తున్నారు. మండలంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40డిగ్రీల వరకు చేరడంతో మనుషులు, జంతువులు ఎండవేడిమికి విలవిల్లాడిపోతున్నారు.

PROTECTION: అరటికి ఈతాకు రక్షణ
A view of Eetaku set up to protect banana plants in Chikkepally

- మొక్కలను ఎండల నుంచి కాపాడే ప్రయత్నం

యాడికి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఎండల నుంచి అరటిమొక్కలను రక్షించుకోవడానికి రైతులు ఈత ఆకులను ఉపయోగిస్తున్నారు. మండలంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40డిగ్రీల వరకు చేరడంతో మనుషులు, జంతువులు ఎండవేడిమికి విలవిల్లాడిపోతున్నారు. ప్రస్తుతం చిక్కేపల్లి, రాయలచెరువు, యాడికి తదితర గ్రామాల్లో అరటి మొ క్కలు నాటారు. ఎండవేడిమి నుంచి అరటి మొక్కలను రక్షించేందుకు రక్షణ వలయంగా ఈతాకును ఏర్పాటుచేశారు. ఈతాకు మొక్కలకు నీడ క ల్పించడమే కాకుండా, కుందేళ్లు, పక్షులు మొక్కల ఆకును తినేయకుం డా రక్షణ ఇస్తుందని తెలిపారు. ఈతాకును నాగసముద్రం, అవుకు తదితర గ్రామాల నుంచి ఒక్కొక్క మట్ట రూ.6తో కొనుగోలు చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 25 , 2026 | 11:16 PM